ఈ ఏడాది 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటించిన బాలయ్య ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయాడు. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ బాలయ్యని తీవ్ర నిరాశకు గురి చేసింది. దీని నుండి కోలుకోవడానికి బాలయ్యకి కొంత సమయం పట్టింది. ఆ తరువాత కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టాడు.

ఈ సినిమాకి సంబంధించి కొన్ని పోస్టర్లు బయటకి వచ్చాయి. అందులో బాలయ్య కొత్తగా కనిపించాడు. కానీ ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. అయితే అభిమానులు మాత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించే సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' వంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే.

అందుకే వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఆరంభ మాసాల్లోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే రవికుమార్ సినిమా కోసం బరువు తగ్గిన బాలయ్య.. బోయపాటి సినిమా కోసం మరింత బరువు తగ్గనున్నాడట. బోయపాటి సినిమాలో బాలయ్య లుక్ ప్రకారం మరో పాతిక కేజీల బరువు తగ్గాల్సివుందట.

ఈ సినిమాలో బాలయ్య రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒక పాత్రలో సరికొత్తగా బాలయ్య తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ లీన్ లుక్ కోసం రోజుకి 5 గంటల చొప్పున కొన్ని నెలల పాటు కసరత్తులు చేయడం, స్పెషల్ డైట్ ఫాలో అవ్వడం వంటివి చేయనున్నారట.