టాలీవుడ్ ఫెస్టివల్స్ ని ఈ సారి స్పెషల్ గా టార్గెట్ చేసినట్లు అర్ధమవుతోంది. గతంలో పండగలకి సినిమాల పోటీ ఏ రేంజ్ లో ఉండేదో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి ఆ డోస్ మరింత పెరిగేలా కనిపిస్తోంది. మొత్తానికి బాలకృష్ణ కూడా క్లారిటీ ఇవ్వడంతో డిసెంబర్ లో బాక్స్ ఆఫీస్ ఫైట్ ఆసక్తిని కలిగిస్తోంది.  అందరికంటే ముందే రవితేజ డిసెంబర్ లో రానున్నట్లు క్లారిటి ఇచ్చాడు. విఐ.ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డిస్కోరాజా షూటింగ్ ఎండింగ్ కి వచ్చేసింది.

ఈ సైన్స్ ఫిక్చన్ కామెడీ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ క్రిస్మస్ 20వ తేదీని ఫిక్స్ చేసుకున్నాడు. మారుతీ డైరెక్షన్ లో చేస్తోన్న ప్రతిరోజు పండగే  సినిమాపై కూడా పాజిటివ్ టాక్ నడుస్తోంది.  వీరి సంగతి అటుంచితే దీపావళి సందర్బంగా పోస్టర్ ని రిలీజ్ చేసిన బాలయ్య ఎవరు ఊహించని విధంగా షాకిచ్చాడు. రవితేజ - సాయి తేజలతో ఫైట్ కి సిద్దమయ్యాడు.

రూలర్ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని బాలయ్య సొంత నిర్ణయం తీసుకున్నాడట. అయితే మొదట దర్శకుడు,నిర్మాత సినిమాను సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారు.  కానీ అప్పుడు మహేష్ - బన్నీ ల మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ భీకరంగా జరగనుందని ముందే ఉహించి కాస్త సందిగ్ధంలో పడ్డారు. గడిచిన రెండేళ్లలో పొంగల్ బరిలో బాలయ్య సినిమాలకు మంచి రికార్డ్ ఉంది.

అదే సెంటిమెంట్ ని ఫాలో అవ్వాలని అనుకున్నారు. కానీ ఇద్దరు హీరోలు ముందే డిసెంబర్ 20ని ఫిక్స్ చేసుకోవడంతో న్యూ ఇయర్ సమయంలో రిలీజ్ చేయడానికి చర్చలు జరుపుతుండగా బాలకృష్ణ డిసెంబర్ 20ని ఫిక్స్ చేయాలనీ ఆర్దర్స్ పాస్ చేశారట.  బాలకృష్ణ తలచుకుంటే సంక్రాంతికి థియేటర్స్ ని చేతుల్లోకి తీసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ వెనకడుగు వేసి క్రిస్మస్ ని ఎందుకు టార్గెట్ చేశారో ఆయనకే తెలియాలి. మరి రూలర్ సినిమాతో బాలకృష్ణ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూద్దాం.