నందమూరి బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ సూపర్ హిట్. వాళ్లిద్దరు కలిసి నటించిన సింహా, శ్రీ రామ రాజ్యం, జై సింహా చిత్రాలు మంచి విజయం సాధించాయి. తాజాగా మరోసారి వీళ్లిద్దరు కలిసి తెరపై అభిమానులకు కనువిందు చేయబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ కాంబోని తెరపైకు మళ్లీ తీసుకుని వస్తున్న దర్శకుడు మరెవరో కాదు ..బోయపాటి శ్రీను.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు త్వరలో బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా ప్రారంభం కానుంది. అన్ని అనుకున్నట్లు సెట్ అయితే డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన మొదట తమన్నా ను అనుకున్నారు. కాజల్ కూడా మరో ఆప్షన్ గా తీసుకున్నారు. అయితే బోయపాటి మాత్రం నయనతార వైపే మ్రొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉంటుంది కానీ మెయిన్ హీరోయిన్ మాత్రం నయనతార.

బోయపాటి ఓ సెంటిమెంట్ గా ఫీలై , సింహా మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయాలని ఆమెను ఒప్పించి తీసుకువస్తున్నట్లు సమాచారం. నయనతార వరస సినిమాలతో చాలా బిజీగా ఉంది. రీసెంట్ గా తెలుగులో చిరంజీవి సరసన సైరాలో కనిపించిన ఆమె తమిళంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అయితే బోయపాటి వెళ్లి కలిసి , ఆమె క్యారక్టరైజేషన్ చెప్పి, డేట్స్ ఎడ్జెస్ట్ మెంట్ ని బట్టే షూటింగ్ చేసుకుంటానని చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. బాలయ్య కూడా నయనతారతో చేయటానికి ఉత్సాహంగా ఉన్నట్లు చెప్తున్నారు. మొత్తానికి హిట్ కాంబినేషన్ మరో సారి రిపీట్ అవుతోందన్నమాట.