Asianet News TeluguAsianet News Telugu

#Unstoppable2: ఈ గెస్ట్ లు ఎంపిక వెనక లోగుట్టు ఏమిటి!?

 అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్ 4లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి అతిథులుగా విచ్చేస్తున్నారు. 

Balakrishna s Unstoppable Season2 turns into a political show
Author
First Published Nov 16, 2022, 11:53 AM IST

నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే ఆహా టాక్స్ షో సెకండ్ సీజన్ కూడా సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే.  ఇప్పటికీ నాలుగు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. అందులో మొదటి ఎపిసోడ్ లో తన బావ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ తో ప్లాన్ చేయగా ఆ ఎపిసోడ్ సూపర్ హిట్ అయింది.ఈ క్రమంలో రెండవ ఎపిసోడ్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. హీరోలు విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ ఇద్దరితో సెకండ్ ఎపిసోడ్ చేసి రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. 

అయితే మూడో ఎపిసోడ్ షూటింగ్ విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడడంతో మొదటి ఎపిసోడ్ ని అన్ సెన్సార్ వెర్షన్ అని చెప్పి మరో అరగంట పాటు మరిన్ని ప్రశ్నలు యాడ్ చేసి రిలీజ్ చేశారు. ఇక నాలుగో ఎపిసోడ్లో హీరోలు అడవి శేష్, శర్వానంద్ ఇద్దరినీ కలిపి ఒక ఎపిసోడ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలో  అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్ 4లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి అతిథులుగా విచ్చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ఎపిసోడ్.. ఈనెల 18 నుంచి ఆహాలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

కిరణ్ కుమార్ రెడ్డి  రాష్ట్ర విభజన అనంతరం ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు గానీ అది సక్సెస్ కాలేదు. 2014 ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆ తరువాత మళ్లీ ఆయన రాజకీయాల్లో కనిపించలేదు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటోన్నారు. తెరమరుగు అయ్యారు.అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరిస్తారనే ప్రచారం జరిగింది గానీ- అది వాస్తవ రూపం దాల్చలేదు. ఈ నేపధ్యంలో ఈ షోలో ఆయన కనపడుతూండటంపై రకరకాల ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో మొదలయ్యాయి. బాలయ్య ఏ ప్రశ్నలు అడగబోతున్నారు. వీరిని గెస్ట్ లుగా పిలవటంలో బాలయ్య టార్గెట్ ఏమిటి అనేది చర్చ మొదలైంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డిని కాంట్రవర్శీ ప్రశ్నలు అడగబోరని తెలుస్తోంది. పనిగట్టుకుని ఎవరినీ టార్గెట్ చేయరని అంటున్నారు.  

బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి క్లాస్‌మేట్స్ కాగా.. బాలకృష్ణ వీరికి ఒక ఏడాది సీనియర్. కానీ, వీరంతా ఒక బ్యాచ్‌లా ఉండేవారు. కలిసి క్రికెట్ ఆడేవారు. ముఖ్యంగా బాలకృష్ణతో కిరణ్ కుమార్ రెడ్డి చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఈ విషయాన్ని ఆయనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడు ఈ ముగ్గురు మిత్రులు కలవబోతున్నారు. తొలిసారి ఒక వేదికపై ముచ్చటించబోతున్నారు. ఆ యాంగిల్ లోనే మాటలు సాగుతాయని అంటున్నారు. సరదా సరదాగా ఈ ఎపిసోడ్ ఉంటుందని చెప్తున్నారు. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios