నందమూరి బాలకృష్ణ నటించిన 105వ చిత్రం ‘రూలర్’. కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సి.కళ్యాణ్ నిర్మాత. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఇటీవల టీజర్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ఒక పాటని విడుదల చేసింది.

ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగడం లేదని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఓవర్సీస్ లో ఈ సినిమాని ఫ్రీగా ఇచ్చేసే పరిస్థితి నెలకొందని సమాచారం. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల మార్కెట్ బాగా పడిపోయింది.

రోజు రోజుకీ హాట్ నెస్ డోస్ పెంచేస్తున్న రంగమ్మత్త!

ఒకప్పటిలా బయ్యర్లు ఎగబడి కొనే రోజులు తగ్గిపోయాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హవా పెరిగిన తరువాత థియేటర్లకు వెళ్లి సినిమా చూసే రోజులు తగ్గాయి. సూపర్ స్టార్ల సినిమాలే అడ్వాన్స్ ల మీద డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారు. అలాంటిది మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఇప్పుడు బాలయ్య 'రూలర్' సినిమాని కూడా డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చేశారు.

అది కూడా ఎలాంటి అడ్వాన్స్ లేకుండా. అంతేకాదు ఖర్చులు కూడా నిర్మాతవేనట. అమెరికా డిస్ట్రిబ్యూటర్ కేవలం డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ చేయడం వరకే చూసుకుంటారట.  మాములుగానే బాలయ్య సినిమాలకు అమెరికాలో అంత క్రేజ్ ఉండదు.

భారీ అంచనాల మధ్య విడుదలైన 'గౌతమీ పుత్ర శాతకర్ణి', ఎన్టీఆర్ బయోపిక్ లకు మాత్రమే కాస్త బిజినెస్ జరిగింది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ భారీ నష్టాలు మిగిల్చింది. ఈ క్రమంలో 'రూలర్' లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ ని అమెరికాలో ఎవరు కొంటారు..? అందుకే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అక్కడ ఖర్చు భరించి మరీ ఇస్తున్నారు. లాభాలు ఏమైనా వస్తే తీసుకుంటారు.. లేదంటే లేదు!