ఈ ఏడాది బాలకృష్ణకు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ద్వారా తీవ్ర నిరాశ ఎదురైంది. ఎంతో ఇష్టపడి నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. ఆ నిరాశ నుంచి బయటపడ్డ బాలయ్య ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జైసింహా చిత్రం మంచి విజయం సాధించింది. దీనితో ఈ రెండవ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. 

రవికుమార్ ఈ చిత్రంలో బాలయ్యని సరికొత్త స్టైల్ లో ప్రజెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన బాలయ్య లుక్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ బాలయ్య స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 26న మధ్యాహ్నం 2:50 గంటలకు NBK105 చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.