టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మాస్ హీరో బాలయ్య నుంచి వస్తున్న మరో యాక్షన్ ఎంటర్టైనర్ రూలర్. నేడు ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నందమూరి అభిమానులు గత కొన్ని రోజులుగా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా బాలకృష్ణ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఇక పలు చోట్ల ప్రీమియర్స్ ఐ విజయవంతగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫ్యాన్స్ ని అమితంగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

హీరోల కెరీర్ లో మాయని గాయాలు.. ఈ సినిమాలు

సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ మొదలైంది. ఎంట్రీ సీన్ తోనే జై బాలయ్య అంటూ విజిల్స్ వేస్తున్నారు. స్టైలిష్ బిజినెస్ మెన్ గా పోలీస్ ఆఫీసర్ గా అలాగే సాధారణ వ్యక్తిలా బాలకృష్ణ తన నటనతో మరోసారి ఈలలు వేయించాడు. ఇక డైలాగ్స్ కి అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ గత సినిమాలో కంటే కూడా ఈ సినిమాలో పలు రకాల వేరియేషన్స్ చూపించాడు.

అలాగే ఫిట్ నెస్ తో కూడా  కనిపిస్తున్నాడు.  దర్శకుడు కెఎస్.రవికుమార్ కంప్లీట్ గా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాస్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేసినట్లు అర్ధమవుతోంది. ఇక యాక్షన్ సీన్స్ కి డైలాగ్స్ కూడా కరెక్ట్ గా సెట్టయ్యాయి. అభిమానులు కోరుకున్న బాలయ్యని రూలర్ లో పర్ఫెక్ట్ చూస్తారని చెప్పవచ్చు. ఇక సోనాల్ చౌహన్ గ్లామర్ షోతో పాటు వేదిక కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.

సినిమాకి మ్యూజిక్ కూడా కాస్త హెల్ప్ అయ్యి ఉంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా సాంగ్స్ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక బాలకృష్ణ తన స్టెప్పులతో మాత్రం అదరగొట్టేశాడని చెప్పవచ్చు. మొత్తానికి రూలర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అభిమానులు ఆకట్టుకునే సినిమా అని ఆడియెన్స్ నుంచి టాక్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ పై పాజిటివ్ గా ఉన్న కామన్ ఆడియెన్స్ సెకండ్ హాఫ్ తో నిరాశ చెందినట్లు అర్ధమవుతోంది.