నందమూరి బాలకృష్ణ మరోసారి సోషల్ మీడియాని షేక్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తన స్టెప్పులతో లైవ్ పెర్ఫెమెన్స్ చేసి విజిల్స్ వేయించారు. ఇటీవల ఒక ఈవెంట్ కి వెళ్లిన బాలయ్య అక్కడ అతిధుల కేరింతల మద్య తన స్టైలిష్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.

ముందుగా అజిత్ సినిమాలోని ఒక మాస్ సాంగ్ కి స్టెప్పులేసిన బాలయ్య బాబు అనంతరం పైసా వసూల్ సినిమాలోని "మామ ఏక్ పెగ్ లా" అనే సాంగ్ కి చిందులేశారు. సాధారణంగా బాలయ్య బాబు డ్యాన్స్ చేయడంలో దిట్ట అని అందరికి తెలిసిన విషయమే. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా డ్యాన్సులు చేస్తూ సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు.   బాలకృష్ణ ఫిట్ నెస్ లో కూడా చాలా మార్పులు వచ్చినట్లు అర్ధమవుతోంది.

రూలర్ కోసం గత కొంత కాలంగా జిమ్ లో వర్కౌట్స్ చేసిన బాలకృష్ణ పేస్ లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరు పదుల వయసు దగ్గరపడుతున్న కూడా అదే ఎనర్జీతో నేటి తరం వారికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఇక బాలకృష్ణ రూలర్ సినిమాలో ఎలాంటి రచ్చ చేశారో తెలియాలంటే క్రిస్మస్ వరకు వెయిట్ చేయాల్సిందే. సి.కళ్యాణ్ నిర్మించిన రూలర్ సినిమాకు కెఎస్.రవికుమార్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 20న సినిమా రిలీజ్ కానుంది