నందమూరి బాలకృష్ణ నుంచి చివరగా వచ్చిన రూలర్ సినిమా డిజాస్టర్ గానిలిచిన విషయమా తెలిసిందే. గత కొంత కాలంగా కథల ఎంపిక విషయంలో సందిగ్ధంలో పడ్డారు. ఎన్టీఆర్ బయోపిక్స్ తో పాటు రూలర్ కూడా దారుణంగా దెబ్బకొట్టడంతో నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు.

ఇటీవల బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి తెచ్చిన సంగతి తెలిసిందే.  ఇక ఆ తరువాత బాలయ్య సీనియర్ డైరెక్టర్ బీ, గోపాల్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బి.గోపాల్ డైరెక్షన్ లో రౌడీ ఇన్స్పెక్టర్ - నరసింహా నాయుడు - పల్నాటి బ్రహ్మనాయుడు వంటి హిట్టు సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు అంతకుమించిన ప్రాజెక్ట్ తో పొలిటికల్ మాస్ మసాలా యాక్షన్ సినిమాను చేయడానికి దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడట. మరోవైపు స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్ర కూడా రీసెంట్ గా బాలకృష్ణ కోసం ఓ కథను రాశారట.

ఆ కథ బాలయ్యకు బాగా నచ్చిందట. మరీ బాలకృష్ణ ముందు ఏ ప్రాజెక్ట ని సెట్స్ పైకి తెస్తాడో చూడాలి. అయితే అందరిలో ఎక్కువగా బి.గోపాల్ సినిమాపైనే ఇంట్రెస్ట్ కలుగుతోంది. పల్నాటి బ్రహ్మనాయుడు తరువాత వారు మళ్ళీ సినిమా చేయలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ తో నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. మరి ఆ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.