టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఏడాదికో సినిమా చేస్తుంటే బాలకృష్ణ మాత్రం కుర్ర హీరోల కంటే స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు. సినిమా ఎలాంటిదైనా సరే తక్కువ సమయంలోనే పూర్తి చేసి తన ఎనర్జీని చూపిస్తున్నాడు. ఇక నెక్స్ట్ రూలర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ డిజాస్టర్ కావడంతో ఈ సినిమాతో కమర్షియల్ గా మళ్ళీ తన బిజినెస్ పెంచుకోవాలని చూస్తున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ నెల 20న రిలీజ్ కాబోతున్న రూలర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కాస్త భయానికి గురి చేస్తున్నట్లు అనిపిస్తోంది. 25కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మినిమమ్ 30కోట్లు షేర్స్ అందుకుంటేనే నిర్మాత సేఫ్ అయినట్లు. ఈ సినిమాని కెఎస్.రవి కుమార్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

2020 బిగ్ మూవీస్.. టాలీవుడ్ @2వేల కోట్లు(+)

గతంలో వీర్ కాంబినేషన్ లో వచ్చిన జై సింహా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాల్ని అందించింది.  కానీ ఇప్పుడు ఎంతవరకు రికవర్ చేస్తుంది అనేది సందేహంగా మారింది. ఎందుకంటె సినిమాకు అనుకున్నంతగా బజ్ లేదు. ప్రమోషన్స్ కూడా చాలా డల్ గా సాగుతున్నాయి.

పోటీగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే సినిమాను కూడా అదే సమయంలో రిలీజ్ చేయబోతున్నాడు. ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ క్రిస్మస్ సెలవుల్లో ఆ సినిమాని టార్గెట్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ రూలర్ సినిమా టాక్ ని బట్టి భారీ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.