సారాంశం

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌.  శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.  

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా రూపొందుతున్న సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. రిలీజ్ కు కేవలం 19 రోజులే ఉండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచేసారు. బాలయ్య కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అనీల్ రావిపూడి సైతం తన రెగ్యులర్ ఫన్ జోనర్ నుంచి ప్రక్కకు వచ్చి ఈ యాక్షన్ ఫిల్మ్ చేసారు. ఈ నేఫధ్యంలో ఈ చిత్రంలో బాలయ్య ఏ పాత్రలో కనిపించబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్య ...గిరిజనుల హక్కుల కోసం పోరాడే సామాజిక కార్యకర్తగా  కనిపించనున్నారు. వారి హక్కుల పరిరక్షణ కోసం ఎంతదూరం అయినా వెళ్లే క్రమంలో ఎదురైన సమస్యలతో సోషల్ డ్రామాగా సినిమా నడవనుంది. తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ హైలెట్ గా ఉంటాయంటున్నారు. బాలయ్య కెరీర్ లో తొలి సారిగా ఇలాంటి పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే వదిలిన టీజర్ లో బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందనేది అర్థమైపోతోంది. ఈ సినిమాను దసరాకి భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఆ దిశగానే ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. విడుదలకి ముందే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకోవడానికి ఓటీటీ సంస్థలు గట్టిగానే పోటీ పడ్డాయి. చివరికి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 18 కోట్లకు డీల్ కుదిరినట్టుగా టాక్ నడుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.  

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌.  శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.  ప్యాషనేట్ టీమ్ 8 నెలల పాటు ఈ చిత్రం కోసం వర్క్ చేసిందని, 24 బ్యూటిఫుల్ లొకేషన్స్‌‌లో, 12 మాసివ్ సెట్లలో షూటింగ్ జరిగిందని చెప్పారు.  బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌‌ ఎంట్రీ ఇస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.