బాబి సినిమాకు బాలయ్య రెమ్యునేషన్ పెంచేసాడు, ఎంతంటే
ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ తాజాగా దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాలయ్య అభిమానులకే కాక సినీ లవర్స్ కి సైతం నచ్చటంతో మంచి హిట్ అయ్యింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో రన్ అవుతుంది. ఈ క్రమంలో బాలయ్య కొత్త సినిమా కూడా పట్టాలు ఎక్కేసింది. బాబీ దర్శకత్వంలో బాలయ్య 109వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నిమిత్తం బాలయ్య తన రెమ్యునరేషన్ ని పెంచేసినట్లు సమాచారం.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు భగవంత్ కేసరి చిత్రానికి గానూ బాలయ్యకు 18 కోట్లు ఇచ్చారని, ఇప్పుడు దాన్ని 25 కోట్ల కు పెంచినట్లు తెలుస్తోంది. వరసపెట్టి బాలయ్య హిట్స్ ఇస్తూండటంతో ఈ స్దాయి రెమ్యునరేషన్ ఇవ్వటానికి నిర్మాతలు వెనకడుగు వెయ్యటం లేదు. అలాగే సినిమా షూటింగ్ కూడా చాలావరకు రామోజీ ఫిలిం సిటీ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల.. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్లలో జరుపుకొనుంది.
బాలయ్య ఎంట్రీ సీన్స్ కోసం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్‌లో బాలయ్య, విలన్ మధ్య యాక్షన్ సీన్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమా బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇది ఒక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎమోషనల్ డ్రామాని ఇప్పటికే తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ”వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్” అనే టాగ్ లైన్‌తో రానుంది. అంతేకాకుండా “ప్రపంచానికి అతను తెలుసు కానీ అతను ప్రపంచంలో ఎవరికీ తెలియదు” అనే ఒక ఇంట్రెస్టింగ్ లైన్ కూడా ఈ పోస్టర్‌లో జోడించారు.
ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.