బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు గెటప్పులతో అలరించబోతున్నారు. బాలయ్య సరసన ఈ చిత్రంలో వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించారు. 

రూలర్ మూవీ త్వరలో థియేటర్స్ లోకి రానుండడంతో బాలయ్య ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగారు. వేదిక, సోనాల్ చౌహన్ లతో కలసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రూలర్ మూవీలో బాలకృష్ణ కార్పొరేట్ అధినేతగా ఫ్రెంచ్ కట్ గడ్డం లుక్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఈ లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి బాలయ్యని ఐరన్ మ్యాన్, టోనీ స్టార్క్ తో పోలుస్తున్నారు. 

దీని గురించి బాలయ్య ఇంటర్వ్యూలో సరదాగా కామెంట్ చేశారు. ఏదైనా పాత్ర జనాలకు బాగా నచ్చితే ఆ నటుడిని ఆ పాత్ర పేరుతో పిలుస్తుంటారు. రూలర్ మూవీలో నా లుక్ బయట వచ్చిన తర్వాత అంతా టోనీ స్టార్క్ అంటున్నారు. ఇప్పుడు నా పేరు మారిపోయింది.. నందమూరి టోనీ స్టార్క్ అని బాలయ్య సరదాగా కామెంట్స్ చేశారు. 

జైసింహ చిత్రాన్ని నిర్మించిన సి కళ్యాణ్ ఈ చిత్రానికి కూడా నిర్మాత. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జయసుధ, భూమిక కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రైతు సమస్యలపై ఉండబోతోంది.