నందమూరి నటసింహం బాలయ్య చివరగా నటించిన రూలర్ మూవీ అభిమానులకు నిరాశనే మిగిల్చింది. తదుపరి చిత్రంతో అయినా ఫ్యాన్స్ ని సంతృప్తి పరచాలని బాలయ్య భావిస్తున్నాడు. బాలయ్య నెక్స్ట్ మూవీ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోతోంది. 

బాలయ్యతో సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలని బోయపాటి శ్రీను తెరకెక్కించారు. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబోలో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మిర్యాల రవీంద్రరెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

లుక్ టెస్ట్ కంప్లీట్.. మొఘల్ సామ్రాజ్యంలో పవన్.. ఉత్కంఠ రేపేలా క్రిష్ చిత్రం!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీని ముందుగా జులై 30న రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం ఈ చిత్రం అక్టోబర్ కి వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఆ తేదీనిబాలయ్య కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి జులై 30న రిలీజ్ చేస్తే బావుంటుందనే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా పడిందా.. బాలయ్య బోయపాటి చిత్రం అదే తేదీన వస్తుందా అనేది తెలియాలంటే రాజమౌళే స్వయంగా స్పష్టతనివ్వాలి.