బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి” ( Bhagavanth Kesari ).


ఏ సినిమాకైనా ఇప్పుడు యుఎస్ టాక్ అనేది చాలా కీలకంగా మారింది. దాంతో కొన్ని సినిమాలకు యుఎస్ ప్రీమియర్స్ వేయటానికి కూడా నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. అయితే బాలయ్య తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’Us ప్రీమియర్స్ మాత్రం ముందుగానే ఎర్లీ నూన్ ప్రీమియర్స్ వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అది తమకు సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే...

Scroll to load tweet…
Scroll to load tweet…

నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘భగవంత్ కేసరి’. బాలయ్య సరికొత్త గా కనిపిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయియంది. తన మార్కు కామెడీని ప్రక్కన పెట్టి పూర్తి స్దాయి యాక్షన్ తో అనిల్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి విజయాల తర్వాత బాలయ్య ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధిస్దారని భావిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్లు ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.

దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో యుఎస్ ప్రీమియర్స్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రం అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ సినిమాస్ కొనుగోలు చేసింది. అక్టోబర్ 18న యూఎస్‌ లో ప్రీమియర్స్ ప్రదర్శిస్తారు. ఎర్లీ నూన్ ప్రీమియర్స్ కు ఏర్పాటు జరుగుతున్నాయి. ఇది ప్రస్తుత జనరేషన్ లో ఉన్న టైర్ వన్ యంగ్ హీరోల సినిమాలకు అమలు చేస్తున్న స్ట్రాటజీ. దీన్నే బాలయ్య సినిమాకు కూడా అమలు చేయనున్నారు. సాధారణంగా యుఎస్ లో బాలయ్య సినిమాల ప్రీమియర్స్ కు పెద్దగా రెస్పాన్స్ ఉండేది కాదు. కానీ ఈ మధ్యన పరిస్దితి మారింది. దాంతో ఎర్లీ నూన్ ప్రీమియర్స్ ని ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారు. 

మరో ప్రక్క బాలకృష్ణ కెరీర్‌‌లోనే అత్యధికంగా రూ. 75 కోట్లకు వరల్డ్ వైడ్ థియెట్రికల్ రైట్స్‌ ను విక్రయించినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్‌ బంప్స్‌ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించిన ఎస్‌ థమన్‌ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.