నందమూరి హీరో బాలకృష్ణ నెక్స్ట్ రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జై సింహా సినిమా అనంతరం కెఎస్. రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం ఓ వర్గం ఆడియెన్స్ ని మాత్రం షాక్ కి గురి చేసింది.  గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య లుక్ పై ట్రోల్స్ వచ్చాయి. బాలయ్య అనేకసార్లు పోలీస్ గెటప్ లో మంచి కిక్ ఇచ్చాడు.

కానీ రూలర్ విషయంలో మాత్రం ఆ కిక్కి మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అసలు ఆ గెటప్ లో ఉన్నది మన బాలయ్యేనా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొదట స్టైలిష్ గెటప్ లో అద్భుతంగా చూపించిన చిత్ర యూనిట్ పోలీస్ గెటప్ లో మాత్రం షాకిచ్చిందనే చెప్పాలి.  అయితే ఈ విషయంలో బాలకృష చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాలయ్యకు తెలియకుండానే ఆ పోస్టర్ ని రిలీజ్ చేసినట్లు టాక్. అందుకే  ప్రమోషన్స్ తనని అడగకుండా చేయవద్దని ప్రతి పోస్టర్ నేను ఒకే చేశాక రిలీజ్ చెయ్యాలని ఆగ్రహానికి లోనైనట్లు తెలుస్తోంది. అసలే ఎన్టీఆర్ సినిమా దారుణంగా బెడిసికొట్టడంతో ఈ సారి మంచి సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్న బాలయ్యకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నచ్చడం లేదట.  

సంక్రాంతికి రానున్న సినిమాల హడావుడి గట్టిగా కనిపిస్తుంది. అలాంటిది డిసెంబర్ కి రానున్న సినిమా ప్రమోషన్స్ ఇంకెలా ఉండాలి.. అని బాలయ్య చర్చించారట. అందుకే ప్రమోషన్స్ డోస్ పెంచాలని తప్పకుండా బాక్స్ ఆఫీస్ అదిరిపోయేలా ఓపెనింగ్స్ ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న రూలర్ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ లలో నటించనున్నట్లు టాక్.