సింహా - లెజెండ్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న బోయపాటి - బాలకృష్ణ మరో సక్సెస్ అందుకోవడానికి సిద్ధమయ్యారు. నేడు బాలకృష్ణ 106వ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. చివరగా ఎన్టీఆర్ బయోపిక్ తో ఊహించని డిజాస్టర్ అందుకున్న బాలకృష్ణ నెక్స్ట్ రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రూలర్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా అనంతరం బోయపాటి సినిమాతో బాలయ్య బిజీ కానున్నాడు. సినిమా డైలాగ్ తో సినిమా మొదటి షాట్ లో నటించిన బాలయ్య ఆడియెన్స్ ని ఆకర్షించారు. "నువ్వొక మాటంటే శబ్దం... అదేమాట నేనంటే శాసనం..!! చెక్ ఇన్ పబ్లిక్ .." అనే డైలాగ్ వింటుంటే సినిమాలో బాలయ్య పాత్ర పవర్ఫుల్ గా ఉండనుందని అర్ధమవుతోంది.

 

లెజెండ్ సినిమాతో కెరీర్ బిగ్ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు మళ్ళీ బోయపాటితే అలాంటి ప్రయోగమే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక యువ సంగీత సంచలనం ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రూలర్ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఆ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.