నట సింహం నందమూరి బాలకృష్ణ మరో నాలుగు రోజుల్లో 60వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పుట్టిన రోజుకు సంబంధించిన సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. 60 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి.. బాలయ్య.. తన షష్టిపూర్తి కూడా జరుపుకుంటారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇక బాలయ్య సినిమాకు సంబంధించి చిన్న ఫొటో వస్తేనే పెద్ద సంబరం జరిపే నందమూరి అభిమానులు, ఇప్పుడు బాలయ్య బర్త్‌డే అంటే కామ్‌గా ఉంటారా? 10 రోజుల ముందు నుంచే బాలయ్య బర్త్‌డే సంబరాలు సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు అభిమానులు. తాజాగా ఆయన బర్త్‌డే సంబంధించిన డీపీని విడుదల చేశారు. కొందరు ప్రముఖులు ఈ విడుదల కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

 

ఇక ఈ డీపీ విషయానికి వస్తే.. బాలయ్య శ్రీకృష్ణదేవరాయలు గెటప్‌లోనూ, అలాగే ‘నిప్పురవ్వ’లోని మాస్ లుక్‌లోనూ ఈ డీపీలో ఉన్నారు. వెనుక జై బాలయ్య, హిందూపూర్, బసవతారకం వంటి పదాలతో పాటు బాలయ్య తల్లిదండ్రుల బొమ్మలు కూడా ఉన్నాయి. ‘‘ఆయనకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వెల్తారు ఏమో, అయిన వాళ్ళకి వస్తే మాత్రం అరక్షణం కూడా ఆలోచించరు..’’ అని తెలుపుతూ ఈ డీపీ విడుదల చేశారు. ప్రస్తుతం బాలయ్య బర్త్‌డే డీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నందమూరి అభిమాలను అందరి వాట్సాప్ డీపీగా ఈ ఫోటోనే కనిపిస్తుండటం విశేషం. డీపీ విడుదలైన కాసేపటికే చాలా మంది అభిమానుల వాట్సాప్ స్టేటస్ లుగా నూ ఈ ఫోటోనే కనిపించడం విశేషం.  సోషల్ మీడియాలోనూ విపరీతంగా షేర్ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే 16.7 వేల మంది నందమూరి బాలకృష్ణ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ఈ డీపీ ని షేర్ చేశారు.

దీంతో... ఇది ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. హీరో మంచు మనోజ్ కూడా ఈ డీపీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. బాలయ్య పై తనకు ఉన్న అభిమానాన్ని అందులో పేర్కొన్నారు.