Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి టీమ్.. మరో డిఫరెంట్ మూవీ

తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన బాహుబలి నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు వెంట‌నే మ‌రో సినిమానో నిర్మించ‌కుండా క్వాంటిటీ కంటే క్వాలిటీ సినిమాల నిర్మాణంపై ఫోక‌స్ పెట్టారు.

bahubali team another different project
Author
Hyderabad, First Published Dec 25, 2019, 7:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టాలీవుడ్ స్థాయిని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన బాహుబలి నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు వెంట‌నే మ‌రో సినిమానో నిర్మించ‌కుండా క్వాంటిటీ కంటే క్వాలిటీ సినిమాల నిర్మాణంపై ఫోక‌స్ పెట్టారు.

ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపశ్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

ఈ సినిమా వీడియో అనౌన్స్‌మెంట్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. జి.ఒ.డి వెబ్ సిరీస్ స‌క్సెస్, బ్రోచెవారెవ‌రురా సినిమాల్లో న‌టించి మెప్పించిన న‌టుడు స‌త్య‌దేవ్ కంచ‌ర‌న ఇందులో హీరోగా న‌టిస్తున్నారు. వేదం వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాన్ని నిర్మించిన ఈ అగ్ర నిర్మాత‌లు ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ శోభు యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ - ``వెంక‌టేశ్ మ‌హ మ‌న తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు సినిమాను సెన్సిబుల్‌గా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు. మల‌యాళంలో విజ‌య‌వంతమైన `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్` చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చేలా త‌ను తెర‌కెక్కించ‌గ‌ల‌డ‌ని న‌మ్మ‌కంతో సినిమాను స్టార్ట్ చేశాం`` అన్నారు.

వెంక‌టేశ్ మ‌హ అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17, 2020 విడుల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్ర‌హీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్ర‌భాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios