టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు మరో సినిమాతో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో చేసిన రెండు సినిమాలు ఈ హీరోకు ఎలాంటి లాభాన్ని ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా భారీ అంచనాలతో విడుదలవ్వగా ఆ సినిమా కూడ బెడిసికొట్టింది. దీంతో నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఆకాష్ కష్టపడుతున్నాడు.  

పూరి జగన్నాథ్ సొంత ప్రొడక్షన్ లో ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ సినిమాపై ఆడియెన్స్ లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇకపోతే ఆ సినిమాపై పూరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. సినిమాలో స్టార్ యాక్టర్స్ ని కూడా ముఖ్య పాత్రల్లో చూపించబోతున్నాడు. టాలీవుడ్ శివగామి రమ్య కృష్ణ కూడా పోక ముఖ్య పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ఎండింగ్ దశలో ఉంది.  రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. పూరి దగ్గర గత కొన్నేళ్లుగా సహాయ దర్శకుడిగా పని చేస్తున్న అనిల్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన రొమాంటిక్ టీమ్ పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటోంది.

పూరి స్టైల్ లోనే ఈ సినిమా తెరక్కేకుతున్నట్లు క్లారిటీగా చెప్పేశారు.ఆకాష్ కు జోడిగా ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ నటిస్తోంది. ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 1.6M ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇన్స్టాలో హాట్ ఫొటోస్ తో రెచ్చిపోయే మోడల్ ఇప్పుడు ఆకాష్ పూరితో హార్డ్ రొమాంటిక్ గా దర్శనమిచ్చింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కూడా సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా టీజర్ ని రిలీజ్ చేసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.