బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ రేసులో వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్ ఉండబోతున్నట్లు అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ పై ఉత్కంఠ నెలకొని ఉంది. హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యే వారి పేర్లు ముందుగానే లీక్ అయిపోతున్నాయి. లీకులకు తగ్గట్లుగానే ఎలిమినేషన్ జరుగుతోంది. 

ఈ వారం ఇంటి నుంచి మహేష్ విట్టా ఎలిమినేట్ కాబోతున్నట్లు బిగ్ బాస్ అభిమానులు అంచనా వేస్తున్నారు. అంచనాలకు తగ్గట్లుగానే మహేష్ ఎలిమినేట్ అవుతాడా లేక ఏదైనా సర్ ప్రైజ్ ఉందా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో నాగార్జున, బాబా భాస్కర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరగబోతున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా విడుదలైన ప్రోమోలో బాబా భాస్కర్ ఏడుస్తూ కనిపిస్తున్నాడు. మీ కళ్ళలో నీళ్లు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు అని నాగార్జున బాబాతో అంటున్నాడు. బాబా కన్నీరు పెట్టుకుంటూ.. నేను ఇక్కడ బిగ్ బాస్ లో పాల్గొనేదానికి మాత్రమే వచ్చాను. నేను ఎలాంటి స్ట్రాటజిలతో హౌస్ లోకి రాలేదు సర్. 

నేను కేవలం బిగ్ బాస్ షోలో జరిగే టాస్క్ లలో పాల్గొంటాను. కానీ బిగ్ బాస్ టైటిల్ గెలవాలనే కోరిక నాకు లేదు అని బాబా భాస్కర్ నాగార్జునకు తేల్చి చెప్పేశాడు. బాబా మాటలకు నాగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో నేడు జరగబోయే ఎపిసోడ్ లో తెలుస్తుంది.