అయోధ్య వివాదానికి సంబంధించి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఐదు ఎకరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు.

చెప్పుకోదగిన తీర్పు వచ్చిందని అన్నారు. ఈ దేశంలో ప్రతీ ఒక్క మతాన్ని గౌరవిస్తామని.. ఆ కారణంగానే మన దేశానికి మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మంచి పేరుందని చెప్పారు. ఈ తీర్పులో ఎవరూ ఓడిపోలేదని.. ఈరోజు దేశం గెలిచిందని అన్నారు. 

Ayodhya verdict: రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్

అయితే హరీష్ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ తీర్పు హిందువులకు వ్యతిరేకంగా వస్తే మీరు ఈ విధంగా స్పందించేవారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ తీర్పుతో ముస్లింలకు అన్యాయం జరిగిందనిమరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని ఇవ్వొచ్చని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పులో  వెల్లడించింది.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్టుగా భావిస్తున్నారు.అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ నిర్వహించాలని కూడ సుప్రీంకోర్టు 

మూడు నెలల్లోపుగా కేంద్రం  అయోధ్య ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని కూడ సుప్రీం కోర్టు ఆదేశించింది.గతంలో అలహాబాద్ కోర్టు ముగ్గురు సమానంగా వివాదస్థలాన్ని పంచుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.