మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ లో హీరోగా రాణించాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన తొలి చిత్రం విజేత మెప్పించలేకపోయింది. దీనితో కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం సూపర్ మచ్చి అనే చిత్రంలో నటిస్తున్నాడు. మంచి ముఖ వచస్సు కలిగిన కళ్యాణ్ దేవ్ తనకు సూటయ్యే ప్రేమ కథా చిత్రాలు, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాడు. 

సూపర్ మచ్చి తర్వాత కళ్యాణ్ దేవ్ శ్రీధర్ సీపాన దర్శత్వంలో ఓ రొమాంటిక్ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

చిన్నారి పెళ్లికూతురు టివి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. క్యూట్ లుక్స్ తో అవికా యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది. అవికా చివరగా రాజుగారి గది 3లో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. 

ఇప్పటివరకు క్యూట్ లుక్స్ తో మాత్రమే ఆకట్టుకున్న అవికా ఇకపై గ్లామర్ షోకు కూడా తెరతీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో అవికా గోర్ హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. మరి ఈ క్యూట్ భామ.. చిరు చిన్నల్లుడితో రొమాన్స్ ఎలా పండిస్తుందో చూడాలి.