చిన్నారి పెళ్లి కూతురిగా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ ఇప్పుడు దర్శనమిస్తున్న తీరు మాములుగా లేదు. ఉయ్యాలా జంపాల సినిమాలో అమ్మడు టీనేజ్ అమ్మాయిగా చాలా పద్దతిగా కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మతి పోగొడుతోంది. ఆమెకు సంబందించిన గ్లామర్ ఫొటోస్ హీటెక్కిస్తున్నాయి.

రాజుగారి గది సినిమాలో అవికా దెయ్యం పాత్రలో కనిపించనుంది.  ఆ హారర్ కామెడీ ఫిల్మ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమాలో అవికా ఎలా కనిపించిందో తెలియదు గాని సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లో మాత్రం హాట్ డ్రెస్సుల్లో హీటెక్కిస్తోంది. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

అందుకు కారణం అమ్మడు నేటితరం యువ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోందా? అనే కామెంట్స్ వస్తున్నాయి.  గ్లామర్ డోస్  పెంచడానికి కూడా రెడీ అంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తోందా అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. ఇకపోతే సినిమాకు సంబందించిన సెన్సార్ రిపోర్ట్ అయితే పాజిటివ్ గానే ఉంది. కానీ సినిమాపై మాత్రం అనుకున్నంత బజ్ క్రియేట్ అవ్వడం లేదు.

గతంలో ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన రాజుగారి గది 2 అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.  కానీ ఇప్పుడు వచ్చే రాజుగారి గది మాత్రం తప్పకుండా సక్సెస్ అందుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. అయితే సెకండ్ మూవీలో నాగ్ - సమంత స్టార్ డమ్ తో సినిమాకు పరవాలేధనిపించే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. మరి ఇప్పుడు పెద్దగా స్టార్స్ లేకుండా వస్తున్న మూడవ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఘాటు అందాలతో హీటెక్కిస్తున్న 'చిన్నారి పెళ్లి కూతురు' అవికా photos