ఆ మధ్యన రిలీజైన హాలీవుడ్‌ మూవీ ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో భుజానికి బాణాలు  పెట్టుకుని, వరసగా వాటిని వదులుతూ ఫైట్ చేసే జెరెమీ రెన్నర్‌ కు వీరాభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే అతను నిజ జీవితంలో హీరో కాదంటోంది అతని భార్య.

జెరెమీ ...నిజ జీవితంలో నోట్లో గన్  పెట్టుకుని సూసైడ్  చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగి కోట్లు మెట్లక్కాడు.  48ఏళ్ల జెరెమీ ఆల్కహాల్ తీసుకుని డ్రగ్స్‌తో మత్తులో మునిగిపోయాడు. తన ఆరేళ్ల కూతురు నిద్రపోతున్న గదిలో తుపాకీ తీసుకుని సీలింగ్‌పై కాల్పులు జరిపాడు.

దీంతో తన మాజీ భార్య సోన్నీ పచావో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నోట్లో గన్ పెట్టుకుని సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నాడంటూ కంప్లైంట్‌లో పేర్కొంది. పోలీసులు ఈ విషయమై ధర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేక రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.