Asianet News TeluguAsianet News Telugu

చిరు కోసం ఆ కథని బయటకు తీసిన పూరి, ఏమౌతుందో?

ఎన్టీఆర్ తో టెంప‌ర్ త‌ర్వాత జ్యోతిల‌క్ష్మీ, ఇజం, రోగ్, పైసా వసూల్ వంటి ఫ్లాపుల‌తో ఫాం కోల్పోయిన డ్యాషింగ్ డైర‌క్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ రీసెంట్ గా రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అంటూ హిట్ ఇచ్చాడు.

Auto Johnny:Is Megastar Chiranjeevi's next ?
Author
Hyderabad, First Published Dec 31, 2019, 5:36 PM IST

మెగాస్టార్ చిరంజీవి ని డైరక్ట్ చేయాలని ప్రతీ డైరక్టర్ కు ఉంటుంది. చాలా మంది డైరక్టర్ల కు జీవితాశయమే అది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌‌ డ్రీమ్ కి కూడా అలాంటి కల ఉంది.  అయితే రకరకాల కారణాలతో అది కలగానే మిగిలిపోయింది ఇంత కాలం. చిరు వారసుడు రామ్ చరణ్‌ పూరి దర్శకత్వంలో లాంచ్ చేశారు. కానీ పూరితో సినిమా చెయ్యడానికి చిరు మాత్రం ఎందుకో అంతగా ఇంట్రస్ట్ చూపించలేదు.

అప్పట్లో మెగాస్టార్ 150వ సినిమాకు గాను ఆటోజాని కథ చెప్పిన పూరి ఫస్టాఫ్ నచ్చినా సెకండ్ హాఫ్ విషయంలో నచ్చక కాదనేశాడు. అయితే అదే కథతో పూరి.. రవితేజ హీరోగా పెట్టి సినిమా చేయాలని చూసాడు..కానీ అదీ ముందుకు వెళ్ళలేదు.

తమన్నా టార్చర్ తట్టుకోలేకపోతున్నా.. శ్రీరెడ్డి!

ఎన్టీఆర్ తో టెంప‌ర్ త‌ర్వాత జ్యోతిల‌క్ష్మీ, ఇజం, రోగ్, పైసా వసూల్ వంటి ఫ్లాపుల‌తో ఫాం కోల్పోయిన డ్యాషింగ్ డైర‌క్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ రీసెంట్ గా రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అంటూ హిట్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ ను తన కుమారుడు చరణ్ తో కలిసి స్పెషల్ షో చూసి చాలా మెచ్చుకున్నారట పూరీ ని మెగా స్టార్. అంతే కాదు పూరీ కథ సిద్ధం చేసుకో మనం కలిసి మూవీ చేస్తున్నాం అంటూ ప్రామిస్ కూడా చేశారట. దాంతో మళ్లీ ఆటో జానీ కథనే బయిటకు తీసాడని సమాచారం.

అయితే ఈ సారి సెంకాడాఫ్ పూర్తిగా మార్చేసాడని, చిరు మారిన ఇమేజ్ కు తగినట్లుగా ఉంటుందని సమాచారం. అయితే ఫస్టాఫ్ మాత్రం చిరు అభిమానులకు పిచ్చ పిచ్చ గా నచ్చే ఎలిమెంట్స్ తో నింపేసాడని అంటున్నారు. దాంతో చిరంజీవి పూర్తి వెర్షన్ విన్నాక ముందుకు వెళ్ధాం అన్నారట. ఓ ప్రక్క ఫైటర్ తో కుస్తీ పడుతూ మరో ప్రక్క ఈ ఆటో జానికి మెరుగులు దిద్దే పనిలో పూరి ఉన్నాడని సమాచారం. కాదన్న కథతో హిట్ కొడితే ఆ కిక్కే వేరు అంటున్నాడట. పూరి ఊపు చూస్తూంటే మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తాడంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios