సారాంశం

బ్లాక్ బాస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ RRR మాస్ అంథియ్ ‘నాటు నాటు’ సాంగ్ ఫుల్ వీడియో ఈ రోజు రిలీజ్ కానుంది. అయితే ఈ సాంగ్ కంటే ముందు మ్యూజిక్ లవర్స్ కు ఆ ఫీల్ గుడ్ సాంగ్ ను రిలీజ్ చేయాలని కోరుతున్నారు.   
 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ RRR. ముఖ్యంగా ఈ చిత్ర సాంగ్స్ ఆడియెన్స్ ను ఎంత ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే ‘నాటునాటు’ కంటే మరోసాంగ్ విపరీతంగా నచ్చేసిందంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇద్దరు బడా హీరోలు కలిసి నటించడంతో ఇంకా సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. మూడో వారాలుగా తన సత్తా చూపిస్తోందీ ‘రౌద్రం రణం రుధిరం’. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్ ను ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. 

ఇక మ్యూజిక్ ట్రాక్ విషయానికొస్తే చిత్రం నుంచి రిలీజ్ అయిన అన్నీ సాంగ్స్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) క్యాచీ ట్యూన్, మాస్ బీజీఎం అందించడంతో సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ‘నాటు నాటు’ సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేక చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర రిలీజ్  కు ముందే ఈ సాంగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సాంగ్ కు మందు వచ్చిన ‘దోస్తీ’, ఆ తర్వాత వచ్చిన ‘ఎత్తర జెండా’, అవని సాంగ్ కూడా హిట్ సాంగ్స్ గా నిలిచాయి. 

అయితే, జక్కన తెలివిగా ఎన్టీఆర్ నటించిన స్పెషల్ సాంగ్ ‘కొమురం భీముడో’ (Komuram Bheemudo)ను మాత్రం ఆడియెన్స్ కు బిగ్ స్క్రీన్ పైనే చూపించారు. సినిమా చూడకముందు ఆడియెన్స్, మ్యూజిక్ లవర్స్ ‘నాటు నాటు’ సాంగ్ కు ఓటేశారు. కానీ సినిమా చూశాక అందరూ ‘కొమురం భీముడో’ను ఓన్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా వేదికన ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ ట్రాక్ నుంచి తమకు ఇష్టమైన సాంగ్ గా ‘కొమురం భీముడు’ను తెలుపుతున్నారు. ఎన్టీఆర్ ఒక్కసాంగ్ తోనే సినిమాను మరోమలుపు తిప్పారని అంటున్నారు. ఎన్నిసార్లు విన్నా ఫీల్ క్యారీ అవుతూనే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. 

 

Scroll to load tweet…

మరోవైపు ఈ పాన్ ఇండియా మ్యూజిక్ రైట్స్ ను ‘లహరి మ్యూజిక్’ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆర్ఆర్ఆర్ మాస్ యాంథిమ్ సాంగ్ Naatu Naatu ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇందుకు ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు సంగీత ప్రియులు మాత్రం నాటు నాటు కంటే ముందు Komura Bheemudo ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇక నాటు నాటు సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఫుల్ వీడియోను రిలీజ్ చేస్తుండటంతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. 

 

Scroll to load tweet…