వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. గతంలో కత్తి మహేష్ టీవీ చర్చా కార్యకమాల్లో బాగా హల్ చల్ చేశాడు. ఇటీవల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని కత్తి మహేష్ మరోసారి దుర్భాషలాడాడు. శ్రీరాముడి ఆహారపు అలవాట్లు, అంతఃపురంలో రాముడి వైభోగాల గురించి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అయ్యాయి. 

దీనితో కొందరు కత్తి మహేష్ పై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా కత్తి మహేష్ కు ఊహించని సంఘటన ఎదురైంది. హైదరాబాద్ లోని ఐమాక్స్ దగ్గర కత్తి మహేష్ పై హిందూ వాదులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. 

దీనితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళన కారులని అదుపులోకి తీసుకున్నారు. కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆతర్వాత అతడిపై దాడి జరగడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసినప్పుడు అతడిపై దాడి జరిగింది. 

రాముడిపై కామెంట్స్.. అడ్డంగా బుక్కైన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్!

ఇక కత్తి మహేష్ ఏకంగా హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందూ మద్దతు దారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కత్తి మహేష్ కారుపై దాడి చేసిన ముగ్గురు బజరంగ్ దళ్ కార్యకర్తలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కత్తి మహేష్ ఎలా స్పందిస్తాడో, ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.