బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కింగ్ ఖాన్ చాలా గ్యాప్ ఇచ్చాడు. వరుస అపజయాలు ఈ హీరో కెరీర్ ని కాస్త సందిగ్ధంలో పడేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఖాన్ మార్కెట్ చాలా వరకు జీరో సినిమాతో తగ్గినట్లు తేలింది.

గత మూడు సినిమాలు షారుక్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో నష్టాల్ని మిగిల్చాయి. దీంతో షారుక్ దాదాపు సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టనున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఎవరు ఊహించని విధంగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఖాన్ నిరంతరం చర్చలు జరపడంతో ఫ్యాన్స్ లో కాస్త జోష్ వచ్చింది. రూమర్స్ అన్ని ఫెక్ అని పోక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు నార్త్ ఆడియెన్స్ ని మరొక రూమర్ కన్ఫ్యూజన్ లో పడేసింది.

ఎందుకంటె అట్లీ చెప్పిన కథపై షారుక్ సంతృప్తిగా లేడట.  విజయ్ తో వరుసగా తేరి - మెర్శల్ - బిగిల్ వంటి సినిమాలను తెరకెక్కించిన అట్లీ బాక్స్ ఆఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమాలు కమర్షియల్ గా బయ్యర్స్ కి నిర్మాతకి కాసుల వర్షాన్ని కురిపించాయి. దీంతో షారుక్ అట్లీ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు.

 

మొదటి చిన్న లైన్ విన్న ఖాన్ ఫిదా అయ్యాడట. అయితే ఇటీవల ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చిన అట్లీ షారుక్ ని పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాడట. ఒక్కసారిగా హీరోగారి మైండ్ చేంజ్ అయినట్లు టాక్ వస్తోంది. తమిళ్ ఆడియెన్స్ ని దృష్టిలో ఉంచుకొని అట్లీ స్థానికంగా క్లిక్కయిన హిట్ ఫార్ములా నార్త్ లో కూడా క్లిక్కవుతుందా అనే డౌట్ వచ్చిందట.

అందుకే కథలో కొన్ని మార్పులు చేయాలనీ నార్త్ ఆడియెన్స్ కి నచ్చేలా ఉండాలని కండిషన్స్ చెప్పారట. దీంతో అట్లీ షారుక్ ఆలోచనల మేరకు కథలో మళ్ళీ మార్పులు చేస్తున్నట్లు టాక్ వస్తోంది. అసలైతే డిసెంబర్ ఎండింగ్ లోనే అట్లీ సినిమాను మొదలుపెట్టాలని అనుకున్న షారుక్ మళ్ళీ మనసు మార్చుకోవడంతో ఇప్పట్లో కొత్త సినిమాపై క్లారిటీ వచ్చేలా లేదని బాలీవుడ్ మీడియాలో కథనాలు వె;వెలువడుతున్నాయి.