Asianet News TeluguAsianet News Telugu

పిల్లో ఛాలెంజ్ లు ఎవడికి కావాలి.. ప్రణీతలా చేసే దమ్ముందా!

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం కకావికలం అవుతోంది. అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇండియా లాంటి అగ్ర రాజ్యాలు కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి.

Atharintiki daredi heroine pranitha subhash winning hearts
Author
Hyderabad, First Published Apr 27, 2020, 3:59 PM IST

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం కకావికలం అవుతోంది. అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇండియా లాంటి అగ్ర రాజ్యాలు కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. దీనితో కరోనని అరికట్టేందుకు దేశాలన్నీ లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. 

ఇండియాలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా రెక్కాడితే కాయాన్ని డొక్కాడని ప్రజలు నిత్యావసరాల కోసం, తిండి కోసం అలమటిస్తున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ఇపప్టికే సెలెబ్రిటీలు కొంతవరకు విరాళాలు అందించారు. కొంతమంది స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. 

ఇక మరికొంతమంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో లాక్ డౌన్ కారణంగా పిల్లో ఛాలెంజ్ లు, బి ది రియల్ మాన్ ఛాలెంజ్ లు చేస్తున్నారు. కానీ అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత మాత్రం అందరి హృదయాలు గెలుచుకుంటోంది. 

ప్రణీత 21 రోజుల్లో దాదాపు 75 వేలమందికి భోజనం పెట్టింది. అంతే కాదు తానే స్వయంగా వండి అవసరమైన వారికి భోజనం పంపుతోంది. ఇప్పటికే ప్రణీత తన ఆర్థిక స్థితికి మించి సాయం చేసింది. దీనితో ప్రణీతపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. పిల్లో ఛాలెంజ్ లు ఎవడికి కావాలి.. ప్రణీతలా చేసే దమ్ముందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios