50వ దశకం ఆరంభం నుంచే నటి హెలెన్ తన అందచందాలతో బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది. అప్పట్లోనే గ్లామర్ షోతో ఆమె రెచ్చిపోయేది. అప్పట్లో పురుషులకు హెలెన్ కలల రాణి. కేవలం పురుషులు మాత్రమే కాదు.. ఆడవారు సైతం హెలెన్ అందాలకు అసూయ చెందేవారు. 

తాజాగా లెజెండ్రీ సింగర్ ఆశా భోస్లే తనకు హెలెన్ పై క్రష్ ఉండేదని పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన ఆమె అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటున్నారు. బాలీవుడ్ లో ఇప్పటివరకు ఎంతో మంది అందగత్తెలు వచ్చారు. కానీ నాకు మాత్రం హెలెన్ అంటేనే ఇష్టం.

నేను కనుక మగాడిగా పుట్టుంటే హెలెన్ తో లేచిపోయేదాన్ని. ఈ విషయాన్ని నేను అప్పట్లోనే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం అని ఆశా భోస్లే అన్నారు. ఆమె అద్భుతమైన అందాల దేవత. నేను పాట పడుతున్నప్పుడు ఆమె స్టూడియోలోకి వస్తే పాట కూడా ఆపేసి ఆమె వంకే చూసే దాన్ని అని ఆశా భోస్లే అన్నారు. 

ఆశా భోస్లే దాదాపు అన్ని భాషల్లో ఎన్నో మధురమైన గీతాలని ఆలపించారు.