టాలీవుడ్ యువ హీరో నిఖిల్ కి ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో బాగా ఇబ్బంది పెట్టిన సినిమా అర్జున్ సురవరం. ఈ సినిమా పూర్తయి దాదాపు ఏడాది కావొస్తోంది. అయితే సినిమా పలు కారణాలతో రిలీజ్ కి నోచుకోలేకపోయింది. ఎట్టకేలకు సినిమాను నేడు విడుదల చేయడానికి నిఖిల్ రంగం సిద్ధం చేశాడు.  ఇప్పటికే సినిమాకు సంబందించిన ప్రీమియర్ షోలను ప్రదర్శించారు.

సినిమా విషయానికి వస్తే.. కథలో నిఖిల్ ఒక జర్నలిస్ట్ గా నటించాడు. నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసే ఓ ముఠా గుట్టురట్టు చేస్తాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సమస్యలు, కోల్పోయే ప్రేమ, గౌరవం, ప్రత్యర్థులపై తీసుకునే రివేంజ్‌ ఇలా అన్ని కలగలిపి సినిమా సాగుతుంది. అలాగే కథలో పొలిటికల్ కాన్సప్ట్ ని జోడించడం ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

ఈ సినిమా తమిళ్ కనిథన్ కి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే దర్శకడు సంతోష్ కథ మెయిన్ ఎమోషన్ ఏ మాత్రం మిస్ కాకుండా మంచి స్క్రీన్ ప్లేతో నడిపించాడు. కథానాయకుడు నిఖిల్ యాక్టింగ్ తెరపై మంచి ఎనర్జీతో కనిపిస్తోంది. లావణ్య త్రిపాఠి గ్లామర్ కూడా పరవాలేధనిపించే విధంగా. ఇక కెమెరా పనితనం సినిమాలో మరో మెయిన్ ప్లస్ పాయింట్.నిఖిల్ - లావణ్యా త్రిపాఠి మధ్య కెమిస్ట్రీ బాగుంది.

ఇంటర్వెల్ కు ముందు ఓ 30 నిమిషాల నుంచి సినిమా అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ మంచి కీలకంగా మారుతాయి. సినిమా అంతా బాగానే ఉంది. కానీ మధ్య మధ్యలో కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు లేకపోలేదు. మ్యూజిక్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బావుండేది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు. ప్రీమియర్ షోతో మంచి టాక్ అందుకున్న అర్జున్ సురవరం మాస్ జనాలను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.