మొన్నటివరకు టాలీవుడ్ లో హిట్టుకోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో నిఖిల్ ఒకరు. అయితే ఎట్టకేలకు మనోడు పాజిటివ్ టాక్ తో మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. సినిమా విడుదల ఆలస్యం అయినప్పటికీ నిఖిల్ ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం చాలా ఉపయోగపడింది.

దీంతో సినిమాకు సంబందించిన ఫస్ట్ డే కలెక్షన్స్ మంచి బూస్ట్ ఇచ్చాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా కుర్ర హీరో వీకెండ్ కూడా బాకా ఆఫీస్ వద్ద తన సత్తా చాటాడు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్జు సురవరం వీకెండ్ లో 3.7కోట్ల షేర్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 6.5కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇంకా మూడు కోట్ల వరకు షేర్స్ అందుకోగలిగితే నిఖిల్ సినిమా ప్రాఫిట్స్ లోకి వస్తుంది.

ఈ వారం కూడా సినిమా కలెక్షన్స్ ఇలానే కొనసాగితే నిఖిల్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం పక్కా. తమిళ్ సినిమా కనితన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్ట్ జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. అలాగే నిఖిల్ యాక్టింగ్ తో పాటు లావణ్య త్రిపాఠి గ్లామర్, లవ్ సీన్స్ కూడా బావున్నాయి. ఎంతో కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తోన్న లావణ్య త్రిపాఠి కూడా ఎట్టకేలకు ఈ సినిమాతో సక్సెస్ అందుకుంది, మరి ఈ సినిమా ద్వారా అమ్మడు ఎలాంటి ఆఫర్స్ ని అందుకుంటుందో చూడాలి.