టాలీవుడ్ యువ హీరో నిఖిల్ హిట్టు చూసి చాలా కాలమైంది. ఎట్టకేలకు అర్జున్ సురవరం సినిమాతో పాజిటివ్ టాక్ అందుకున్న ఈ హ్యాపీ డేస్ యాక్టర్ కలెక్షన్స్ పరంగా కూడా పరవాలేధనిపించాడు. నిఖిల్ చివరగా ఎక్కడికి పోతావు చిన్నవాడ - కేశవ సినిమాలతో ఆడియెన్స్ నుంచి మంచి టాక్ అందుకున్నాడు. అయితే గత ఏడాది వచ్చిన కిర్రాక్ పార్టీ ఈ హీరో ఎనర్జీని కాస్త దెబ్బకొట్టిందనే చెప్పాలి.

 ఇక ఫైనల్ గా అర్జున్ సురవరంతో సక్సెస్ అందుకోవాలని చూసిన నిఖిల్ కి ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సమస్యలు ఎదురయ్యాయి. సినిమా టైటిల్ వివాదం తరువాత రిలీజ్ వరకు ఎన్నో ఆటుపోట్లను తిన్న నిఖిల్ ఎట్టకేలకు ఏడాది అనంతరం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఆ సినిమా మొదటిరోజే 4.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.

నిఖిల్ కెరీర్ కి ఇదొక మంచి ఓపెనింగ్ అని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిరోజే మంచి షేర్స్ అందుకున్నాడు. ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందని ఎవరు ఊహించలేకపోయారు. ఓ విధంగా నిఖిల్ షాకిచ్చాడనే చెప్పాలి. టి.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ మూవీ కనిథన్ కి రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ కంటెంట్ ఏ మాత్రం మిస్ కాకుండా దర్శకుడు తనదైన శైలిలో తెరకెక్కించిన విధానం ఓ వర్గం జనాలను బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ హ్యాపీగా ఫీలవుతోంది.