సౌత్ సినీ ఇండస్ట్రీలో అందమైన కథానాయకుల్లో అరవింద్ స్వామి ఒకరు. రోజా సినిమాతో దేశమంతా గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ యాక్టర్ సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ గెటప్స్ తో దర్శనమిస్తున్నాడు. దృవ సినిమాలో విలన్ గా కనిపించి తెలుగు ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చిన ఈ 49ఏళ్ల యాక్టర్ నెక్స్ట్ జయలలిత బయోపిక్ లో తో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

సీనియర్ యాక్టర్ ఏంజీఆర్ క్యారెక్టర్ కోసం ఆయన రీసెంట్ గా సరికొత్త మేకోవర్ తో దర్శనమిచ్చారు. ఆ లుక్ తో అరవింద్ స్వామి నిజంగా షాకిచ్చారనే చెప్పాలి. ఈ వయసులో కూడా ఫిట్ నెస్ లో మార్పులు తెస్తూ మంచి ప్రయోగమే చేస్తున్నారు. పాత్ర కోసం కాస్త బొద్దుగా మారినట్లు తెలుస్తోంది. మరి ఆ పాత్ర ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.  సినిమాకు సంబందించిన [ప్రీ ప్రొడక్షన్ వర్క్ థ్ ప్రస్తుతం చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

కంగనా రనౌత్ తలైవి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఏఎల్.విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలుకాబోతోంది. ఇక సినిమాకు పూర్తి కథను బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించారు.  ఇక సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేసి వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బయోపిక్ కోసం దాదాపు 150కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. మణికర్ణిక - మెంటల్ హై క్యా వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న ఈ బేబీ జయ బయోపిక్ తో ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.