తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా కోలీవుడ్ లో అనేక రకాల బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. రమ్యకృష్ణ నటించిన వెబ్ సిరీస్ కి ఇప్పటికే మంచి గుర్తింపు దక్కింది. ఇంకా మరీకొన్ని జయ సినిమాలు సెట్స్ పైకి వెళుతున్నాయి. వాటిలో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ 'తలైవి' సినిమా కూడా ఉంది.

కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో దాదాపు 100కోట్ల బడ్జెట్ తో జయ బయోపిక్ ని ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాలో సీనియర్ హీరో అరవింద్ స్వామికి సంబందించిన లుక్ ని విడుదల చేశారు. ఆయన ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కంగనా జయ పాత్రపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆమె అస్సలు సెట్టవ్వలేదని టాక్ వచ్చింది.

కానీ అరవింద్ స్వామీ మాత్రం అచ్చు గుద్దినట్లు ఎంజీఆర్ లా దర్శనమివ్వడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.   నేడు ఎంజీఆర్ జన్మదిన సందర్బంగా చిత్ర యూనిట్ ఈ లుక్ ని విడుదల చేశారు. కంగనా స్టార్ హోదాకు తగ్గట్టుగా ఉండాలని పెద్ద పెద్ద స్టార్స్ ని సినిమాలో సెలెక్ట్ చేసుకుంటున్నారు. జయలలిత రాజకీయ రంగంలో ఎదగడానికి ఎంజీఆర్ పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆ పాత్ర కోసం అరవింద్ స్వామికి బారి రెమ్యునరేషన్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ బయోపిక్ ఈ సినిమాకు కథను అందించారు.