కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో విజయ్ ఒకరు. ఇది నిన్నటి వరకు. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా తలైవా స్థానానికే విజయ్ ఎసరుపెట్టాడు. బిగిల్ సినిమా ఎవరు ఊహించని విధంగా 300కోట్లకు పైగా వసూళ్లతో తమిళ్ సినిమా స్థాయిని పెంచేసింది. తమిళ్ నాడులో అయితే రోజుకో రికార్డుతో విజయ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చెసింది.

ఇక నెక్స్ట్ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించాలని విజయ్ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ నెక్స్ట్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో మాస్టర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా అనంతరం విజయ్ మురగదాస్ డైరెక్షన్ లో థ్రిల్లర్ సినిమాను చేయనున్నాడు. అయితే ఆ సినిమా గతంలో వచ్చిన తుపాకీ కథకు కొనసాగింపుగా ఉండనుందట. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇకపోతే దర్శకుడు మురగదాస్ సీక్వెల్ కోసం 170కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారట. ఇక సినిమా బిజినెస్ 300కోట్లు దాటే అవకాశం ఉందట. ఇక సినిమా రిలీజ్ అయ్యిందంటే ఈజీగా 500కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టగలదని అంచనా వేస్తున్నారు. బిగిల్ కంటే ముందు సర్కార్ 250కోట్లను అందుకుంది. దానికంటే ముందు వచ్చిన మెర్శల్ 200కోట్లను ఈజీగా అందుకుంది.

ఇలా సినిమా సినిమాకు విజయ్ తన బాక్స్ ఆఫీస్ రేంజ్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. ఫైనల్ గా నెక్స్ట్ మాస్టర్ సినిమాతో 400కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అనంతరం తుపాకీ సీక్వెల్ కి మరొక టార్గెట్ సెట్ చేసుకున్న విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.