భరతమాత ముద్దు బిడ్డ, మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై తెరకెక్కించాలనుకుంటున్న బయోపిక్ చిత్రం వివాదాల మయంగా మారుతోంది. కమెడియన్ అలీ అబ్దుల్ కలాం పాత్రలో నటిస్తున్న బయోపిక్ చిత్రం ప్రస్తుతం తెరక్కుతోంది. 

ఇటీవలే కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ చిత్ర పోస్టర్ ని ఆవిష్కరించారు. అమెరికాకు చెందిన పింక్ జాగ్వార్ ఎంటర్టైన్మెంట్స్, హాలీవుడ్ దర్శక నిర్మాత జానీ మార్టిన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కానీ వీరికంటే ముందుగా అభిషేక్ అగర్వాల్ అబ్దుల్ కలాం బయోపిక్ చిత్రాన్ని ప్రకటించారు. 

అలీ ప్రధాన పాత్రలో కలాం బయోపిక్ తెరపైకి రావడంతో అభిషేక్ అగర్వాల్ స్పందించారు. అబ్దుల్ కలాం బయోపిక్ హక్కులు తమకే సొంతం అని అంటున్నారు. గతంలో తాము అబ్దుల్ కలాం కుటుంబ సభ్యుల నుంచి బయోపిక్ హక్కులు తాము సొంతం చేసుకున్నట్లు అభిషేక్ అగర్వాల్ అంటున్నారు. 

నెటిజన్ విమర్శ.. కూల్ గా బుద్ధిచెప్పిన భల్లాల దేవుడు

ప్రస్తుతం తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రంపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. చాలా రోజుల క్రితమే అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర కలసి అబ్దుల్ కలాం బయోపిక్ చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పుడు సడెన్ గా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా మరొకరు కలాం బయోపిక్ ని ఆవిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పింక్ జాగ్వార్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.