Asianet News TeluguAsianet News Telugu

షో అయిపోయాక ఏం చేస్తాం... బిగ్ బాస్ కు సెన్సార్ ఉండాల్సిందే... కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్డ్..

బిగ్ బాస్ రియాల్టీషోపై కీలక వ్యాఖ్యాలు చేసింది ఏపీ హైకోర్డ్.. కళ్ళుమూసుకుని.. చూసీ చూడనట్టు ఉండాలా..?  షో అయిపోయాక ఏం లాభం అంటూ ఘాటుగా స్సందించింది. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

AP Hight Corut comments On Bigg Boss Shoew Sensor JMS
Author
First Published Jul 27, 2023, 10:38 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు ప్రమోలు వదలగా.. అవి వైరల్ అవుతున్నాయి. త్వరలో షో స్టార్ట్ చెయ్యానికి అంతా రోడీ చేసుకున్నారు. అయితే ఈ బిగ్ బాస్ షో గత కొంత కాలంగా వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. 
దానికి తోడు కోర్టుల్లో కేసులు కూడా బుక్ అవుతున్నాయి. తజాగా బిగ్ బాస్  రియాలిటీ షో అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఏపీ హైకోర్డ్ లో ప్రజాహిత వ్యాజ్యాలు ధాఖలు చేశారు. ఇవి నిన్న(జులై26)  ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చాయి. 

అయితే ఎటువంటి సెన్సార్ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని, కాబట్టి ఇటువంటి షోలను రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటలలోపు ప్రసారం చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రతిగా ఎండోమోల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ తరపున సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం షో ప్రసారం కావడం లేదని, ఇలాంటి సమయంలో ఈ వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని, కాబట్టి ఇకపై ప్రసారం కాబోయే కార్యక్రమంపై అభ్యంతరం ఉంటే మళ్లీ పిల్ వేసేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు.  స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాటీవీ తరపున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బిగ్‌బాస్ షో ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్ విధానం లేదని, షో చూడడం ఇష్టం లేకపోతే చానల్ మార్చుకోవచ్చని సూచించారు.   

అందరి వాదనలు విన్న ఉన్నత  ధర్మాసనం బిగ్ బాస్ మేకర్స్ కుషాక్ ఇచ్చింది. బిగ్ బాస్ షో తీరుపై తీవ్రంగా స్పందించింది.  బిగ్ బాస్ షోకు  సెన్సార్‌షిప్ అవసరమేనని తేల్చి చెప్పింది. షో ప్రసారం  అయ్యాక ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందని హైకోర్ట్ నిలదీసింది. ఇలా ఇష్టం వచ్చినట్టు  చానళ్లు  అశ్లీల ప్రోగ్రామ్స్ రూపొందించి ప్రసారం చేస్తున్నా పర్యవేక్షించకూడదా? అని ప్రశ్నించింది. నైతిక విలువలు కాపాడుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. షో ప్రసారానికి ముందే సెన్సార్ విషయంలో  కేంద్రానికి సూచనలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. 

ఇక ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టార్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మాటీవీ, ఎన్‌డేమోల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తో పాటు బిగ్ బాస్ కు హోస్ట్ గా చేస్తున్న కింగ్ నాగార్జునకు కూడా నోటీసులిచ్చింది హైకోర్ట్. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios