పొన్నియన్ సెల్వన్ నవల క్రీ.శ 947కాలానికి సంబంధించినది. చోళ చక్రవర్తులు, మహారాణులకు సంబంధించిన కథ ఇది. ఈ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రానికి కాస్టింగ్ కూడా భారీగా అవసరం.అందుకే మణిరత్నం ఐశ్వర్యరాయ్, నయనతార, కీర్తి సురేష్, విక్రమ్, కార్తీ, మోహన్ బాబు లాంటి నటులందరిని ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నారు. 

అనుష్క కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అనుష్క ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. నయనతార పాత్ర ఎక్కువగా ఉండడంతో తన పాత్రకు ప్రాధాన్యత ఉండదని అనుష్క భావించి ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

అందులో వాస్తవం లేదని, రెమ్యునరేషన్ డీల్ కుదరకపోవడం వల్లే అనుష్క ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. భారీ ప్రాజెక్ట్ కావడంతో అనుష్క 4 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్. కానీ కేవలం అనుష్క పాత్రకే అంత డబ్బు వెచ్చించడం వృధా అని మణిరత్నం కూడా భావించారట. అందుకే అనుష్క పొన్నియన్ సెల్వన్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.