సూపర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన స్వీట్ గర్ల్ అనుష్క శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి పద్నాలుగేళ్లవుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ అందుకుంది. ఈ 15 ఏళ్లలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా భాగమతికి సరైన రేంజ్ లో పోటీని ఇవ్వలేకపోయారు.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న అనుష్క మార్కెట్ స్థాయి కూడా పెరుగుతోంది.  అసల్యు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న అనుష్క నెక్స్ట్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వీటీతో వర్క్ చేయబోయే దర్శకుడు మరెవరో కాదు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో మంచి ఫీల్ ని కలిగించే డైరెక్టర్ గౌతమ్ మీనన్. గతకొంత కాలంగా అనుకున్నంతగా సక్సెస్ లు చూడని గౌతమ్ ఈ సారి ఒక లేడి ఓరియెంటెడ్ యాక్షన్ కథతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.  గౌతమ్ కథ చెప్పగానే హీరోయిన్ అనుష్క సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొదటి నయనతారతో చర్చించినప్పటికీ ఆమె బిజీగా ఉండడంతో ఒప్పుకోలేదట.

దీంతో అనుష్కకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి గౌతమ్ మీనన్ ఆమెను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాతో బిజీగా ఉన్న అనుష్క నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని కొత్త తరహా కథలని వింటోంది. ఇక ఫైనల్ గా ఆమెకు గౌతమ్ కథ నచ్చడంతో నెక్స్ట్ ఇయర్ మిడ్ లో ఆ సినిమాని రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యిందట. మరి అమ్మడు ఈ డిఫరెంట్ ప్రాజెక్టులతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.