సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. హీరోయిన్ గా, విమెన్ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ గా నిలిచిన అనుష్క మేకప్ వేసి చాలా కాలం అయ్యింది. ఇక రీసెంట్ గా ఆమె లాంగ్ గ్యాప్ తరువాత సెట్స్ లో అడుగు పెట్టింది. 


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలకు సమానంగా ఇమేజ్ తో పాటు క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌ అనుష్క శెట్టి. బాహుబలి, అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు అనుష్క కెరీర్ ను ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఆమె ఇమేజ్ ను అమాంతం ఆకాశాన్ని అంటేలా చేశాయి. ఇక వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో మోస్ట్‌ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత ఇండస్ట్రీ నుంచి మాయమైపోయింది. 

 నిశ్శబ్ధం మూవీ తరువాత ఇంకో సినిమాకు ఆమె సంతకం చేయలేదు. అనుష్క సిల్వర్ స్క్రీన్ కు దూరమయ్యి మూడేళ్లు అవుతోంది. అయితే గత కొద్ది నెలలుగా అనుష్క కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆమె సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేశారు. అభిమానుల కోరిక మేరకు అనుష్క సినిమాలు చేయడానికి రెడీ అయ్యింది. ఈక్రమంలో తన ఫ్యాన్స్‌కు స్వీటీ గుడ్‌న్యూస్‌ చెప్పంది. ఎట్టకేలకు ఆమె సెట్‌లో అడుగుపెట్టింది.కాగా స్వీటీ ప్రస్తుతం యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తుంది. ఈ మూవీ సెట్ లోనే ఆమె జాయిన్ అయినట్టు తెలుస్తోంది.

ఇక అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మూవీ టీమ్ ఆమెతో కేక్‌ కట్‌ చేయించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ ను అనుష్క తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. 17 ఏళ్ల ఈ ప్రయాణంలో సినీ ఇండస్ట్రీ, ఫ్యామిలీ, వెల్‌ విషర్స్‌ నుంచి అమితమై ప్రేమ, మద్దతు లభించాయి అంటూ చెప్పుకొచ్చింది. 


ఇక ఫ్యాన్స్‌ గురించి చెప్పడానికి తనకు మాటల రావడంలేదంటోంది స్వీటి. వారి అన్‌కండీషనల్‌ లవ్‌, సర్‌ప్రైజ్‌ అనంతమైనది అంటూ రాసుకొచ్చింది. వారంత నా జీవితంలో ఒక పార్ట్‌గా నిలిచారు. వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానంది. ఇక వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటుంది బ్యూటీ. గ్యాప్ లేకుండా సినిమాలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.