‘భాగమతి’ హిట్‌ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్ధం’. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ టీజర్ ని దీపావళి సందర్బంగా రిలీజ్ చేసారు. చాలా విభిన్నంగా ఉన్న ఈ ప్రీ టీజర్ రిలీజ్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మాధవన్ ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్‌గా కనిపించనున్నాడు. మాధవన్ వయోలిన్ ప్లే చేయడం, అనుష్క చేతి వేళ్లు మాత్రమే ప్రీ-టీజర్‌‌లో చూపించారు. నవంబర్ 7న అనుష్క బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు..  ఈ ప్రీ టీజర్ ని ఇక్కడ చూడవచ్చు.

అలాగే ఈ సినిమాలోని కీ సీన్స్ ను అమెరికాలోని సీటెల్‌లో షూట్ చేసారు. దీంతో సీటెల్‌ షెడ్యూల్‌ పూర్తైంది.  ఈ సినిమా  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గ‌నుంది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ & మ‌ల‌యాళం ఈ 5 భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీర‌జ కోన‌, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ – షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్;సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్