'సూపర్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి పద్నాలుగేళ్లవుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇన్నేళ్లలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా స్వీటీ రేంజ్ ని రీచ్ అవ్వలేకపోయారు. 

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న అనుష్క మార్కెట్ స్థాయి కూడా పెరుగుతోంది.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరిస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మొదట జనవరిలో ఆ తరువాత ఫిబ్రవరిలో విడుదల అవుతుందనుకున్న ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ కి వెళ్లింది. సమ్మర్ లో పెద్దగా పోటీలేని సమయంలో ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు చిత్రబృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా కనిపించనుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.