బాహుబలి అనంతరం అనుష్క వేస్తున్న ప్రతి అడుగు ఊహించని విధంగా ఉంటోంది. ఆమె ఎంచుకుంటున్న కథలు కూడా అలానే ఉంటున్నాయి. ఇక కొడితే బాక్స్ ఆఫీస్ హిట్టే కొట్టాలని జేజమ్మ వేస్తున్న ప్లాన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ప్రస్తుతం అమ్మడు నిశ్శబ్దం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే చిత్ర యూనిట్ మాత్రం రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతోంది. ఇక ప్రస్తుతం ఒక కొత్త రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలైతే ఈ సినిమాని జనవరి ఎండింగ్ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమవుతున్నట్లు టాక్.  ఇక ఫైనల్ గా సినిమాను సమ్మర్ లో పెద్దగా పోటీ లేని సమయంలో ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

నిశ్శబ్దం సినిమా ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగిస్తోంది. ఫస్ట్ లుక్ తోనే ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో మాధవన్ ఒక సెలబ్రెటీ మ్యూజిషియన్ గా అంథోని అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కోన వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక - అంజలి - హాలీవుడ్ యాక్టర్ మైకేల్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.