టాలీవుడ్ జేజమ్మ అనుష్క కొత్త సినిమా కోసం ఆడియెన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇటీవల అనుష్క సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా కనిపించి మంచి సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆమె నిశ్శబ్దం సినిమా ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగిస్తోంది. ఫస్ట్ లుక్ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. 

ఆడియెన్స్ నుంచి వస్తున్న డిమాండ్ కి చిత్ర యూనిట్ నిశ్శబ్దం వీడి స్పందించక తప్పలేదు. ఫైనల్ గా మాధవన్ లుక్ కి సంబందించిన అప్డేట్ ఇచ్చారు. మాధవన్ ఒక సెలబ్రెటీ మ్యూజిషియన్ గా అంథోని అనే పాత్రలో కనిపించబోతున్నాడు. సోమవారం స్పెషల్ సర్‌ప్రైజ్ లుక్ ని ఏర్పాటు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. నిన్నటి నుంచి కిక్కిచ్చే అప్డేట్ ఇవ్వనున్నట్లు అధికారికంగా వివరణ ఇచ్చారు. మరి మాధవన్ లుక్  ఎలా ఉంటుందో చూడాలి. 

కోనా వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.  తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక మాధవన్ - అంజలి - హాలీవుడ్ యాక్టర్ మైకేల్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.