టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి చాలా రోజుల తరువాత గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం నిశ్శబ్దం. భాగమతి అనంతరం తెలుగు తమిళ్ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న అనుష్క కొత్త సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు పెరిగాయి. కోన వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన అనుష్క సినిమా గురించి అనేక రకాల విషయాలను చెబుతూ మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. అలాగే ప్రభాస్ గురించి ఎలాంటి విషయాన్నీ అడిగినా చెబుతూ వస్తోంది. రీసెంట్ గా క్యాష్ ప్రోగ్రాం కి కంటెస్టెంట్ గా వెళ్లిన అనుష్క అక్కడ ప్రభాస్ తో తనకున్న అనుబంధం గురించి చాలా చక్కగా చెప్పింది.  సినిమాలో నటించడం అనేది మానుకోనని అలాగే ప్రభాస్ తో తనకున్న స్నేహాన్ని కూడావ దులుకోనని, ఎన్నటికీ అలా జరగదని అనుష్క శెట్టి  వివరణ ఇచ్చింది. ఒక్క మాటతో వారి స్నేహంపై క్లారిటీ ఇచ్చిన అనుష్క గత ఇంటర్వ్యూలో కూడా ప్రభాస్ తో ప్రేమలో ఉన్నట్లు వచ్చిన రూమర్స్ ని కొట్టిపారేసింది.

ఆ రూమర్స్ గురించి మా ఇద్దరికి తెలుసాని వాటిని తాము ఎక్కువగా సీరియస్ గా తీసుకోమని కూడా అనుష్క బదులిచ్చింది.  ఇక సినిమా విషయానికి వస్తే.. తెలుగుతో పాటు తమిళ్ - హిందీ భాషల్లో కూడా ఈ నిశ్శబ్దం సినిమాను ఒకేసారి తెరకెక్కించారు. సౌత్ లో ఎలాగూ అనుష్కకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి బాలీవుడ్ లో ప్రమోషన్ డోస్ కాస్త పెంచాలని చూస్తున్నారు. ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ లో మాధవన్ అలాగే హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.