యంగ్ బ్యూటీ  అనుపమా పరమేశ్వరన్ నటించిన మరో తాజా చిత్రం ‘బట్టర్ ఫ్లై’ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.  

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తోంది యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఇటీవల నిఖిల్ సరసన ‘కార్తీకేయ 2’లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మరోసారి ఈ క్రేజీ జంట ‘18 పేజెస్’ చిత్రంతోనూ అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్ ప్రారంభించారు. ప్రస్తుతం నిఖిల్, అనుపమా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇదిలా ఉంటే అనుపమా నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘బట్టర్ ఫ్లై’ (Butterfly) కూడా రిలీజ్ కు సిద్ధమైంది. చాలా కాలంగా ఆలస్యం అవుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేళలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఘంటా సతీష్ బాబు రచన, దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోంది. నిహాల్ కొదటి కథానాయకుడిగా నటించారు. ఈ థ్రిల్లర్ చిత్రంలో ఒకప్పటి నటి భూమికా చావ్లా కూడా కీలక పాత్రలో నటించింది. జెన్ నెక్స్ట్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి అర్విజ్ మరియు గిడియన్ కట్టా సంగీతం అందించారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. విభిన్న కథలతో అలరిస్తున్న అనుపమా ఆడియెన్స్ లో మరింతగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ ‘టిల్లు స్క్వేర్’చిత్రంలో అవకాశం అందుకొని మళ్లీ దూరమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో ‘సైరెన్’, మలయాళంలో ‘జేఎస్కే’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Scroll to load tweet…