మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే అనుపమ పరమేశ్వరన్ నటనలో మంచి మార్కులు వేయించుకుంది.

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే అనుపమ పరమేశ్వరన్ నటనలో మంచి మార్కులు వేయించుకుంది. కానీ ఈ మలయాళీ భామ అందాల ఆరబోతకు దూరం. 

హద్దులు దాటకుండా నటించేందుకు మాత్రమే ఇష్టపడుతుంది. తెలుగులో అనుపమ శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులని ఆకట్టుకునేలా క్యూట్ లుక్స్ లో ఉండే ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

View post on Instagram

తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రెండు పిక్స్ అభిమానులని తికమక పెట్టే విధంగా ఉన్నాయి. 'ఈ అందమైన ప్రపంచంలో నువ్వు నేను మాత్రమే ఉన్నాం.. కపుల్ గోల్స్' అంటూ బీచ్ లొకేషన్ ఉన్న పిక్ పోస్ట్ చేసింది. ఈ పిక్ లో అనుపమ ఉందో లేదో అర్థం కావడం లేదు. దూరంగా బికినిలో ఓ మహిళ, ఓ వ్యక్తి కూర్చుని ఉన్నారు. అక్క కూర్చుని ఉన్నది అనుపమనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

View post on Instagram

మరో మరో పోస్ట్ లో అనుపమ తాను బీచ్ లో ఉన్న షాడో ఇమేజ్ ని పోస్ట్ చేసింది. అనుపమ వెకేషన్ లో ఉందా.. అదే నిజమైతే తన ప్రియుడితో ఉందా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే అక్కడ ఉన్నది టీం ఇండియా క్రికెటర్ బుమ్రానా అనే అనుపమని ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

గత కొన్ని నెలలుగా అనుపమ, బుమ్రా ప్రేమలో ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో బుమ్రా అనుపమని ఫాలో కావడం, అనుపమ బుమ్రాని ఫాలో కావడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సందేహాలపై క్లారిటీ రావాలంటే ఈ మలయాళీ పిల్ల స్పందించాల్సిందే. 

రామ్ చరణ్ ఐటమ్ భామ ఫోటో షూట్.. మతిపోగొట్టేలా అందాలు!