Asianet News TeluguAsianet News Telugu

Karthikeya-2 :డైరక్టర్ కు బహిరంగ క్షమాపణ చెప్పిన అనుపమ

  నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా 2014లో విడుదల బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకున్న కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది.  ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది.

Anupama parameswaran publicly apolgized to Chandoo Mondeti
Author
Hyderabad, First Published Aug 17, 2022, 6:07 AM IST

కార్తికేయ‌-2 సంచ‌ల‌న వ‌సూళ్ల‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. సోమ‌వారం ఇండిపెండెన్స్ డే సెల‌వును పూర్తిగా ఉప‌యోగించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఉత్త‌రాదిన కూడా అంచ‌నాల‌కు మించి వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత కూడా జోరు త‌గ్గించ‌ట్లేదు. మంగ‌ళ‌వారం సెల‌వు రోజు కాకపోయినా  కార్తికేయ‌-2 మాత్రం  చాలా స్ట్రాంగ్‌గా నిల‌బ‌డింది. మార్నింగ్ షో, మ్యాట్నీల‌కు ఓ మోస్తరు స్థాయిలో వ‌సూళ్లు రాగా.. ఈవెనింగ్, నైట్ షోల‌కు చాలా వ‌ర‌కు హౌస్ ఫుల్స్ ప‌డిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే చాలా వ‌ర‌కు షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో న‌డిచాయి. 

ఈ నేపధ్యంలో చిత్రం యూనిట్ ...సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ స్టేజీపై దిల్ రాజు ...మీడియాకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. ఇక అనుపమా పరమేశ్వరన్ అయితే  డైరక్టర్  చందూ మొండేటికి మనస్పూర్తిగా క్షమాపణలు తెలిపింది.  రెండేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా, ఇప్పుడు జనం ముందుకు వచ్చి ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందని చెబుతూనే… షూటింగ్ లో జరిగిన ఓ చేదు అనుభవాన్ని అనుపమా గుర్తు చేసుకుంది. 

అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ...‘గుజరాత్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు బ్యాక్ ఏక్ వచ్చిందని, అయినా ఎలాగో కష్టపడి ఆ షెడ్యూల్ పూర్తి చేశాన’ని చెప్పింది. ఒక రోజు టెక్నికల్ ఇష్యూస్ కారణంగా షూటింగ్ చాలా ఆలస్యమైందని, తనకూ బాగా పెయిన్ ఉండటంతో, ఫ్రస్ట్రేషన్ కు గురై, ‘చందు మొండేటి తో వర్క్ చేయడం పట్ల రిగ్రేట్ ఫీలవుతున్నాన’ని చెప్పానని తెలిపింది. 

అయితే ఆ రోజు తాను అలా మాట్లాడుకుండా ఉండాల్సిందని, తన వైపు నుండి పెద్ద తప్పే జరిగిందని అనుపమా బాధపడింది. అందుకు ఆయనకు ఇవాళ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని అనుపమా అంది. ఆయనతో వర్క్ చేయడం వల్లే ఇంత గొప్ప విజయం తనకు లభించిందని చెప్పింది. ఈ విజయాన్ని హీరో నిఖిల్ తో పాటు తానూ ఇంకా జీర్ణించుకోలేకుండా ఉన్నానని, ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడు చందూ మొండేటికి అనుపమా పరమేశ్వరన్ కృతజ్ఞతలు తెలిపింది.

ఇక ఈ చిత్రం రిలీజ్ కు ముందు జరిగిన ప్రమోషన్స్ కు హీరోయిన్‌ అనుపమ డుమ్మా కొట్టింది.  ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. షూటింగ్ 5 గంటలకు ఉన్న సరే టైం కి వచ్చేస్తుంది కానీ ప్రమోషన్స్ అంటే మాత్రం అనుపమ నుంచి మంచి రెస్పాన్స్ ఉండదు అని చెప్పుకొచ్చాడు నిఖిల్. తాజాగా ఈ విషయంపై స్పందించిన అనుపమ ఇంస్టాగ్రామ్ లో ఒక ట్వీట్ చేసింది. నేను కార్తికేయ సినిమా ప్రమోషన్ కి ఎందుకు రావడం లేదు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను.

 'కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్‌కు నేను ఎందుకు రాలేకపోతున్నానో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను మరో రెండు సినిమాలకోసం పగలనకా రాత్రనకా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. ఇతర ఆర్టిస్టులతో కాంబినేషన్‌ సన్నివేశాలను ఎప్పుడో షెడ్యూల్‌ చేశారు. మరోవైపు కార్తికేయ 2 ప్రమోషన్స్‌కు నేను ప్లాన్‌ చేసుకున్నా. కానీ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడటంతో షెడ్యూల్‌ మొత్తం తారుమారైంది. కాబట్టి ఇక్కడ డుమ్మా కొట్టలేని పరిస్థితి. నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాఅంది. 

Follow Us:
Download App:
  • android
  • ios